బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ ఆల‌యంలో నీతా అంబానీ ప్రత్యేక పూజ‌లు

Nita Ambani special pooja at Balkampet Yellamma temple

హైదరాబాద్‌ః బుధ‌వారం నాటి ఐపీఎల్ మ్యాచ్‌ కోసం హైదరాబాద్‌కు వ‌చ్చిన‌ రిల‌య‌న్స్ అధినేత ముఖేశ్‌ అంబానీ భార్య నీతా అంబానీ రాత్రి బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించారు. బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ, పోచ‌మ్మ ఆల‌యంలో ఆమె ప్రత్యేక పూజ‌లు నిర్వ‌హించారు. సుమారు 15 నిమిషాల పాటు ఆల‌యంలో ఉన్న నీతా అంబానీ.. అద్దాల మండ‌పాన్ని ద‌ర్శించుకున్నారు.

అంత‌కుముందు ఆమెకు ఆల‌య ఈఓ కుంట నాగ‌రాజు, ఛైర్మ‌న్ కొత్త‌ప‌ల్లి సాయిబాబాగౌడ్ స్వాగ‌తం ప‌లికారు. ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌ల అనంత‌రం నీతా అంబానీకి అమ్మ‌వారి తీర్థ‌ప్ర‌సాదాలు అంద‌జేయ‌డం జ‌రిగింది. ఇక ముంబై ఫ్రాంచైజీ య‌జ‌మాని అయిన నీతా అంబానీ హైద‌రాబాద్‌లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు ఎప్పుడు మ్యాచ్‌ ఆడినా ఆమె త‌ప్ప‌నిస‌రిగా అమ్మవారిని ద‌ర్శించుకుంటారు.