భారీ వర్షంలోనూ కొనసాగుతున్న బాసర విద్యార్థుల నిరసన

తమ డిమాండ్స్ ను పరిష్కరించాలంటూ గత ఆరు రోజులుగా బాసర విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు కూడా వారి ఆందోళన ఆపలేదు. ఓ పక్క భారీ వర్షం పడుతున్నప్పటికీ విద్యార్థులు మాత్రం వారి ఆందోలనను విరమించలేదు. డిమాండ్లపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక వివరణ, లేదా విద్యాశాఖ మంత్రి సబితా ఇందరారెడ్డి రాతపూర్వక హామీ ఇస్తే ఆందోళన విరమిస్తామని విద్యార్థులు చెబుతున్నారు. న్యాయమైన తమ 12 డిమాండ్లను నెరవేర్చాలని స్పష్టం చేస్తున్నారు విద్యార్థులు. తాము గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని.. అవసరమైనవే కోరుతున్నామన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మేము ఏమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, ఆర్జీయూకేటి యాక్ట్ ప్రకారం ఛాన్సలర్, వైస్ చాన్సలర్ పోస్టుల ను భర్తీ ప్రక్రియ చేయాలన్నారు. 311, 312 గ్రాంట్ లు రావడం లేదని విద్యార్థులు వెల్లడించారు. 2018 నుంచి వైస్ ఛాన్సలర్ భర్తీ చేస్తామన్నారు.. ఇప్పటికీ చేయలేదని విద్యార్థులు మండిపడ్డారు. ఆర్థిక మంత్రి 312 గ్రాంట్ విడుదల చేయాలనంటూ విద్యార్థులు తమ డిమాండ్ లను చదివి వినిపించారు. సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లేదా ప్రెస్ నోట్ సంతకం విడుదల చేస్తే అప్పుడు ఆందోళన విరమిస్తామని వారు స్పష్టం చేశారు.