ఎంజిబిఎస్‌-జేబిఎస్‌ మెట్రో మార్గంపై కెటిఆర్‌ సమీక్ష

Minister KTR
Minister KTR

హైదరాబాద్‌: తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హైదరాబాద్‌ మెట్రో మొదటి దశలో భాగంగా జేబిఎస్‌-ఎంజిబిఎస్‌ మార్గం ప్రారంభోత్సవంపై అధికారులతో మంత్రి కెటిఆర్‌ సమీక్షించారు. హైదరాబాద్‌ మెట్రో దేశంలో రెండో అతిపెద్ద మెట్రో నెట్‌ వర్క్‌గా అభివృద్ధి చెందుతుందిని ఆయన అన్నారు. ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్న జేబిఎస్‌-ఎంజిబిఎస్‌ మెట్రో మార్గం ఈ నెల 7వ తేదీన ప్రారంభోత్సవం కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లపై మంత్రి తలసాని, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, మెట్రో, పోలీస్‌ అధికారులతో ఇవాళ ఆయన ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. కారిడార్‌ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, దీనికోసం తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్షలో చర్చించారు. ఈ కారిడార్‌లోని ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరు అయ్యేందుకు అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకోవాలని మెట్రో అధికారులను కెటిఆర్‌ ఆదేశించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/