రోజుకు 60 వేల కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం

శాసనసభలో కరోనా చర్యలపై చర్చ

minister-etela-rajender

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కరోనా వైరస్‌పై స్వ‌ల్ప కాలిక చ‌ర్చ‌ను రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి తెలంగాణ ప్ర‌భుత్వం ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. క‌రోనా వ్యాపించ‌కుండా మార్చి 14న పాక్షిక లాక్‌డౌన్‌ను ప్ర‌క‌టించామ‌న్నారు. ఇండోనేషియా నుంచి క‌రీంన‌గ‌ర్ వ‌చ్చిన వారిని వెంట‌నే ఐసోలేష‌న్ చేశామ‌ని తెలిపారు. క‌రోనా ప‌రిస్థితిని సిఎం కెసిఆర్‌ నిత్యం ప‌ర్య‌వేక్షిస్తున్నారు. రాష్ర్టంలోనే క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల కేంద్రాలు ఏర్పాటు చేశామ‌ని చెప్పారు. ప్ర‌స్తుతం రోజుకు 60 వేల క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. అన్ని ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నాం. వ్యాధి తీవ్రత త‌క్కువ ఉన్న‌వారికి హోంఐసోలేష‌న్‌లోనే చికిత్స అందిస్తున్నామ‌ని తెలిపారు. వ్యాధి తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న‌వారికి ఆస్ప‌త్రుల్లో చికిత్స అందిస్తున్నామ‌ని చెప్పారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/