పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది

బండి సంజయ్ కు అడ్డొస్తే పగిలిపోతుంది..రాజాసింగ్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. బండి సంజయ్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోందని అన్నారు. సంజయ్ కు ప్రజలంతా సాదరంగా స్వాగతం పలుకుతున్నారని చెప్పారు. ఈ యాత్ర సక్సెస్ అయితే కేసీఆర్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని అన్నారు. బండి సంజయ్ కు అడ్డు వస్తే పగిలిపోతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తప్పుడు నివేదికలను ఇచ్చి హుజూరాబాద్ ఉపఎన్నికను ఆపేశారని టీఆర్ఎస్ ప్రభుత్వంపై రాజాసింగ్ మండిపడ్డారు. ఎన్నిక ఎప్పుడు జరిగినా గెలిచేది బీజేపీనే అని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనే అని అన్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో రాజకీయ నాయకుల పేర్లు కూడా వస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/