నేడు గచ్చిబౌలిలో కరోనా ఆస్పత్రి ప్రారంభం

అత్యాధునిక వైద్య సదుపాయాలతో 1500 పడకల ఆస్పత్రి

hospital in Hyderabad
hospital in Hyderabad

హైదరాబాద్‌: హైదరాబాద్‌ శివారులో ఉన్న గచ్చిబౌలిలో 1500 పడకల ఆస్పత్రిని తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేయించింది. దాని కోసం దాదాపు వెయ్యి మంది కార్మికులు అహర్నిశలు కష్టపడ్డారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో దేశంలోనే అతి పెద్ద కరోనా ఆస్పత్రిగా రికార్డు సృష్టించిన ఈ హాస్పిటల్ నేడే ప్రారంభం కానుంది. కరోనా వల్ల ఎదురయ్యే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన సిఎం కెసిఆర్‌ .. అందుకు అనుగుణంగా చర్యలను వేగవంతం చేశారు. కాగా ఇప్పటి వరకు స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన ఓ కాంప్లెక్స్‌ను పూర్తిగా కరోనా ఆస్పత్రిగా మార్చేశారు. 15 అంతస్తులున్న ఈ భవనంలో ఆస్పత్రికి సంబంధించి నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/