ఖైరతాబాద్‌లో తొలి కరోనా మరణం

సుమారు 200 మందికి కరొనా పరీక్షలు

doctors
doctors

హైదరాబాద్‌: ఇటీవల ఖైరాతాబాద్‌లో ఓ వృద్దుడు మరణించగా… ఆ తరువాత అతనికి చేసిన పరీక్షలలో కరోనా పాజిటివ్‌ రావడంతో రాష్ట్రంలో తొలి కరోనా మరణంగా పరిగణించారు. ఇపుడు అతడు నివాసం ఉన్న ప్రాంతాన్నంతా అధికారులు జల్లెడి పడుతున్నారు. మృతుడు తిరిగిన, నివాసమున్న ప్రాంతాలలో సుమారు 200 మంది బ్లడ్‌ శాంపిల్స్‌ సేకరిస్తున్నట్టు వైద్యాధికారులు తెలిపారు. ప్రజల్లో ఆందోళన పెరగకుండా చూసెందుకు ఇంటింటికీ వెళ్లి పరీక్షలు చేస్తున్నామని, ఇటీవల విదేశాలతో పాటు, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వివరాలను సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/