ఏప్రిల్ 30 దాకా ఆంక్షలు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెల్లడి

Trump extends Social Distance guidelines until April 30

కరోనా వైరస్ ను జూన్ లోగా నిరోధించడం కష్టమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. రానున్న రోజుల్లో మరణాల సంఖ్య మరింత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

కరోనా నిరోథానికి విధించిన ఆంక్షలను ఏప్రిల్ 30 వరకూ పొడిగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అప్పటి వరకూ సామాజిక దూరం పాటించాల్సిందేనన్నారు.

వైట్ హౌస్ లో  విలేకరులతో మాట్లాడిన ఆయన జూన్ నాటికి దేశంలో పరిస్థితులు యథాతథ స్థితికి చేరుకుంటాయని కొద్ది రోజుల కిందట చెప్పిన ఆయన ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదని నిరాశ వ్యక్తం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/