తెలంగాణ కొత్త స‌చివాల‌యానికి అంబేద్క‌ర్ పేరు

సాయంత్రంలోగా ఉత్తర్వులు

Telangana secretariat building likely to be named after Ambedkar

హైదరాబాద్ః తెలంగాణ కొత్త స‌చివాల‌యానికి భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ పేరు పెట్టాల‌ని టిఆర్ఎస్ స‌ర్కారు నిర్ణ‌యించింది. గురువారం ఈ మేర‌కు సీఎం కెసిఆర్ కీల‌క ఆదేశాలు జారీ చేశారు. కెసిఆర్ ఆదేశాల‌కు అనుగుణంగా గురువారం సాయంత్రంలోగా దీనికి సంబంధించిన అధికారిక ఉత్త‌ర్వులు జారీ చేసే దిశగా రాష్ట్ర ప్ర‌భుత్వం క‌స‌రత్తు చేస్తోంది.

ఢిల్లీలో నూత‌నంగా నిర్మించిన పార్ల‌మెంటు భ‌వ‌నానికి అంబేద్క‌ర్ పేరు పెట్టాలంటూ ప‌లు వ‌ర్గాల నుంచి వ‌చ్చిన విన‌తుల మేర‌కు… ఆ దిశ‌గా చ‌ర్య‌లు తీసుకోవాలంటూ టిఆర్ఎస్ సర్కారు ఇటీవ‌లే ముగిసిన అసెంబ్లీ స‌మావేశాల్లో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపింది. అయితే కేంద్రం నుంచి ఎలాంటి స్పంద‌న రాక‌పోవ‌డంతో తెలంగాణ నూత‌న స‌చివాల‌యానికి అంబేద్క‌ర్ పేరు పెడుతూ కెసిఆర్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/