తెలంగాణలో 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు

telangana Schools to Run Half Day from March 15

హైదరాబాద్ః తెలంగాణలో ఈ నెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒంటిపూట బడులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండనున్నాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం పెడతారు. ఒంటిపూట బడులు ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు ఉంటాయి. గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో తెలంగాణ విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నది.