ఫుడింగ్ మింక్ పబ్​ డ్రగ్స్ కేసు : డ్రగ్స్ మాత్రమే కాదు అమ్మాయిల కూడా దిగుమతి చేసినట్లు తేలింది

బంజారాహిల్స్ ఫుడింగ్ మింక్ పబ్​ లో డ్రగ్స్ బయటపడడం తో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ వ్యవహారం సంచలనంగా మారింది. ప్రస్తుతం పోలీసులు ఫుడింగ్ మింక్ పబ్​ యజమాని అభిషేక్‌ ను కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ విచారణలో అనేక అంశాలు బయటకు వస్తున్నాయి. కేవలం డ్రగ్స్ మాత్రమే కాదు గోవా, ముంబై నుంచి అమ్మాయిలను కూడా రప్పిస్తారనేది తేలింది. వారితో పబ్ లలో అసభ్య కరమైన డాన్సులు చేయిస్తారని తెలుస్తుంది.

అభిషేక్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కాల్​డేటా, ఫోన్‌లోని సమాచారం ప్రకారం విచారణ జరుపుతున్నారు. గతంలో గోవాలో పబ్‌ను నిర్వహించిన అభిషేక్.. అదే కల్చర్‌ను హైదరాబాద్‌కు తీసుకువచ్చినట్లు నిర్ధారణకు వచ్చారు. అందుకే గోవా, ముంబై ప్రాంతాల్లోని కాల్​గర్ల్స్‌తో సహా పలువురు మోడల్స్‌ను సైతం హైదరాబాద్‌కు పలుమార్లు రప్పించినట్లు అనుమానిస్తున్నారు. వారికోసం ఓ ప్రైవేట్ ట్రావెల్స్ నుంచి వాహనాలను సైతం బుక్​చేశారు. ముంబైకి చెంది మోడల్స్, కాల్​గర్ల్స్‌ను తీసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు. గోవాలో పబ్​మూసివేసిన తర్వాత హైదరాబాద్‌కు వచ్చి కిరణ్​రాజుతో కలిసి పబ్‌ను నిర్వహిస్తూ ఇక్కడ కూడా అదే కల్చర్‌ను పలువురు ప్రముఖులకు రుచి చూపించారు. అంతేకాకుండా ప్రతి వీకెండ్​లోనూ హైదరాబాద్​నుంచి గోవాకు ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు రావడం, వారితో పరిచయాలు పెరగడం, వారికి గోవాలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం కూడా అభిషేక్​చేసినట్లు తెలుస్తోంది.