ఏప్రిల్ 27- మే 31 వరకు వేసవి సెలవులు

1 నుంచి 9వ తరగతి విద్యార్థులు పై తరగతులకు ప్రమోట్

Telangana schools-Summer Holidays
Telangana schools-Summer Holidays

Hyderabad: తెలంగాణలో ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు .ఆదివారం ఉదయం సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యా శాఖ అధికారులతో పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సంబంధించి వేసవి సెలవుల నిర్ణయంపై సమీక్షించారని మంత్రి తెలిపారు. పాఠశాలలు, కాలేజీ పున:ప్రారంభంపై జూన్ 1న నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏప్రిల్ 26వ తేదీనే చివరి పనిదినమని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు రద్దు చేసి 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేసినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న 53, 79, 388 మంది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసినట్లు మంత్రి వివరించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/