విశాఖ రైల్వే జోన్‌పై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ క్లారిటీ

విశాఖ రైల్వే జోన్‌పై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ పూర్తి క్లారిటీ ఇచ్చారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని, ఇందుకు అనుగుణంగా కేంద్రం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ఇదివరకే రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని, రద్దు ఆలోచన లేదని , అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు. విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం తెలిపినట్లు జరుగుతోన్న ప్రచారాన్ని మంత్రి ఖండించారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయడం లేదన్నవి కేవలం పుకార్లేనని తెలిపారు. రైల్వే జోన్‌ ఏర్పాటుకు డీఆర్‌ఎం కార్యాలయం పక్కనే స్థలం ఎంపిక చేశారని, భూసేకరణ కూడా పూర్తయింద ని పేర్కొన్నారు. అయితే విశాఖ జోన్‌ ఏర్పాటులో పునరాలోచిస్తే ఆ విషయం చెబుతామని ప్రకటించారు.

మంత్రి తెలిపిన వివరాల ప్రకారంగా చూస్తే ఇక త్వరలోనే విశాఖ రైల్వే జోన్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ విషయంపై బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ..విశాఖ రైల్వే జోన్ ను కేంద్ర మంత్రి త్వరలో ప్రారంభిస్తారని.. రైల్వే జోన్ వియషంలో ఎటువంటి వివాదాలు లేవని తెలిపారు. రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర కెబినెట్ ఆమోదం తెలిపిందని..ఈ విషయంపై వచ్చే వదంతులను ఏమాత్రం నమ్మవద్దని తెలిపారు.