ప్రజా దర్బార్ కాదు ప్రజావాణిగా నామకరణం

తెలంగాణ సీఎం గా ప్రమాణ స్వీకారం చేపట్టిన రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ చూపిస్తున్నారు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ కేసీఆర్ కు మాత్రమే పరిమితమైన ప్రగతి భవన్ ను ప్రజా దర్బార్ గా మర్చి..ప్రజల్లోకి తీసుకొచ్చిన రేవంత్..తాజాగా ప్రజాదర్బార్ పేరును మార్చారు. ప్రజాదర్బార్ ను కాస్త ప్రజావాణిగా నామకరణం చేసారు.

ప్రతి మంగళవారం, శుక్రవారం రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ ప్రజావాణి నిర్వహించాలని ఫిక్స్ అయ్యారు. ఉదయం 10 గంటలలోగా ప్రజాభవన్‌కు చేరుకున్న వారినే లోనికి అనుమతి ఇస్తామని అధికారులు చెప్పారు. దివ్యాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా.. ఈ ప్రజా దర్బార్‌పై కొందరు సానుకూలంగా స్పందిస్తుంటే మరికొందరు విమర్శలు కూడా చేస్తున్నారు.