మరికాసేపట్లో మొదలుకాబోతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ వర్షా కాల సమావేశాలకు సర్వం సిద్ధం అయింది. శుక్రవారం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కాబోతున్నాయి. సభ తొలి రోజున ఇటీవల కన్నుమూసిన ఎమ్మెల్యేలు, మండలి సభ్యులకు సభ సంతాపం తెలుపనున్నది. ఆ తర్వాత స్పీకర్, చైర్మన్ అధ్యక్షతన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం కానున్నది. సభ ఎన్నిరోజులు నిర్వహించాలనేది నిర్ణయించనున్నారు.

ఈ సమావేశాల్లో ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన దళిత బంధు పథకంపై చర్చించనున్నారు. దీనిపై ప్రత్యేక చర్చ చేపట్టాలని సీఎం కేసీఆర్ స్పీకర్ అనుమతి కోరే అవకాశం ఉంది. యాసంగిలో వరిసాగు, ధాన్యం కొనుగోలు అంశం, తెలుగు రాష్ర్టాల మధ్య జలజగడం, ఉద్యోగ నియామకాలపై సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఆర్టీసీ ప్రైవేటీకరణ, విద్యుత్ ఛార్జీల పెంపు సహ ఇతర అంశాలపై సభ్యులు చర్చించనున్నారు.