జగన్ సంచలన నిర్ణయం : సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ సేవలు

జగన్ సంచలన నిర్ణయం : సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ సేవలు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలను అందుబాటులోకి తీసుకరావాలని ఆదేశించారు. త్వ‌ర‌లో గ్రామ‌, వార్డు స‌చివాలయాల్లో రిజిస్ట్రేష‌న్ సేవ‌లు ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్ర‌య‌త్నాలు మొదలుపెట్టింది. ఎంపిక చేసిన 51 గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లోనే భూములు, ఆస్తుల రిజిస్ట్రేష‌న్లు జ‌రుగుతాయ‌ని ప్రభుత్వం తెలిపింది.

1908 రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 6ను అనుసరించి నిర్ధేశించిన 51 గ్రామ సచివాలయాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా సేవలు అందించటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని డాక్టర్ రజత్ భార్గవ అధికారులను కోరారు. రిజిస్టేషన్ల ప్రక్రియలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా సచివాలయ కార్యదర్శులకు అవసరమైన పూర్తి స్దాయి శిక్షణను అందించాలని ..ఇందుకు అవసరమైన కార్యాచరణ సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు.