గర్ల్స్ హాస్టల్ లో విద్యార్థులతో చిందులేసిన తెలంగాణా వర్శిటీ వీసీ రవీందర్ గుప్తా

తెలంగాణా వర్శిటీ వీసీ రవీందర్ గుప్తా వివాదాల్లో చిక్కుకున్నారు. రెండు రోజుల క్రితం ఓ మహిళా ప్రొఫెసర్ ను దుర్భాషలాడిన ఘటన ఇంకా మరవకముందే..తాజాగా గర్ల్స్ హాస్టల్ లో విద్యార్థులతో కలిసి చిందులేసిన వీడియోస్ వైరల్ గా మారింది. గణేష్ నిమజ్జనం తర్వాత.. గర్ల్స్ హాస్టల్ లో విద్యార్థులతో కలిసి వీసీ చిందులేశాడు. డబ్బులు ఎగురవేస్తూ.. డాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ విషయం బయటకు వచ్చింది. గర్ల్స్ హాస్టల్ లో అనుమతి లేకుండా వీసీతో పాటు ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం సైతం సీరియస్ గా ఉన్నట్లు సమాచారం.

ఇక తెలంగాణ యూనివర్సిటీకి ప్రొఫెసర్ రవీందర్​కు బాధ్యతలు అప్పగించినప్పటి నుండి ఏదొక వివాదంతో రవీందర్ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఇలా తరుచు వివాదాల్లో నిలిచినప్పటికీ ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఇక ఇప్పుడు గర్ల్స్ హాస్టల్ లోకి వెళ్లి డాన్సులు చేయడం..చుట్టూ గర్ల్స్ ను పెట్టుకొని ఓ క్లబ్ లో మాదిరి చిందులు వేయడం ఏంటి అని వారంతా ప్రశ్నింస్తున్నారు. మరి దీనిపై రవీందర్ ఏమంటారో..? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.