వైద్యశాస్త్రంలో కేటలిన్ కరికో, డ్రూ వీస్ మన్ లకు నోబెల్‌

Katalin Kariko, Drew Weissman win Nobel Prize in medicine

స్టాక్ హోం : అంతర్జాతీయం అత్యంత విశిష్ట పురస్కారం నోబెల్ ప్రైజ్.. వివిధ రంగాల్లో అపూర్వమైన కృషి చేసిన వారికి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులు అందిస్తారు. తాజాగా, ఈ ఏడాది నోబెల్ పురస్కారాలకు తెరలేచింది. ఈ ఏడాది వైద్య రంగంలో కేటలిన్ కరికో, డ్రూ వీస్ మన్ లకు నోబెల్ అవార్డు ప్రకటించారు.

శాస్త్ర పరిశోధక రంగానికి సవాలుగా నిలిచిన న్యూక్లియోసైడ్ ఆధారిత మార్పులపై వీరు చేపట్టిన పరిశోధనలు విజయవంతం అయ్యాయి. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ఎంఆర్ఎన్ఏ సాంకేతికతో రూపొందించే వ్యాక్సిన్ల తయారీకి వీరి పరిశోధనలు మరింత ఊతమివ్వనున్నాయి.

కేటలిన్ కరికో హంగేరియన్-అమెరికన్ బయోకెమిస్ట్. ఆమె ఆర్ఎన్ఏ ఆధారిత జీవ వ్యవస్థలపై స్పెషలైజేషన్ చేశారు. ఇక, డ్రూ వీస్ మన్ అమెరికా వైద్యుడు, శాస్త్రవేత్త. ఆర్ఎన్ఏ బయాలజీ పరిశోధక రంగంలో విశిష్ట సేవలందించారు. కరోనా సంక్షోభ సమయంలో బయో ఎన్ టెక్, ఫైజర్, మోడెర్నా వంటి ఫార్మా సంస్థల వ్యాక్సిన్లు అభివృద్ధి చేయడంలో డ్రూ వీస్ మన్ కృషి ఉంది.