గుజరాత్ లో విజయం దిశగా దూసుకుపోతున్న బిజెపి

182 స్థానాలకు గాను 152 స్థానాల్లో బిజెపి ముందంజ
20 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్

bjp-vote-share-crosses-53-percent-mark-in-gujarat-assembly-polls

అహ్మాదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం దిశగా బిజెపి దూసుకుపోతోంది. రాష్ట్రంలో వరుసగా ఏడో సారి అధికార పీఠాన్ని కైవసం చేసుకోబోతోంది. గత ఎన్నికల్లో సాధించిన స్థానాల కంటే ఈసారి మరిన్ని ఎక్కువ స్థానాల్లో జయకేతనం ఎగురవేయబోతోంది. అఖండ విజయం సాధించబోతున్న నేపథ్యంలో, బిజెపి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. గాంధీనగర్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ శ్రేణులు అప్పుడే సంబరాలను మొదలు పెట్టారు. పార్టీ కార్యాలయంలో డెకరేషన్ పనులు చేపట్టారు. స్వీట్లు పంచుకుంటున్నారు.

గత 27 ఏళ్లుగా గుజరాత్ లో బిజెపి అధికారంలో ఉండటం గమనార్హం. 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ లో బిజెపి ప్రస్తుతం 152 స్థానాల్లో లీడ్ లో ఉంది. బిజెపికి దరిదాపుల్లో ఇతర పార్టీ ఏదీ లేదు. కాంగ్రెస్ 20 స్థానాల్లో, ఆప్ 6 చోట్ల, ఇతరులు 4 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ బిజెపి రికార్డు స్థాయిలో గెలవబోతోంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/