పుష్ప 2 నుండి 20 సెకండ్ల వీడియో రిలీజ్

అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో రాబోతున్న పుష్ప 2 నుండి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. నేడు రష్మిక పుట్టిన రోజు సందర్భంగా చిన్న వీడియో టీజర్ ను విడుదల చేసింది పుష్ప టీం. అసలు పుష్ప ఎక్కడ? అంటూ 20 సెకండ్ల వీడియోతో సినిమా ఫై మరింత అంచనాలు పెంచేసింది.

‘తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప.. అసలు పుష్ప ఎక్కడ’ అంటూ న్యూస్ వచ్చినట్లు చూపించడం.. పుష్పకు మద్దతుగా పోలీస్ డౌన్ డౌన్ అంటూ అతని అభిమానులు గొడవ చేయడం కనిపించింది. పుష్ప ఎక్కడ? అనే శోధర త్వరలోనే ముగుస్తుంది. రాజ్యం ఏలే ముందు సాగే వేట గురించి ఈ నెల 7న సాయంత్రం 4.05 గంటలకు తెలుస్తుంది అని ట్యాగ్ లైన్స్ ఇచ్చింది చిత్ర బృందం. ఈ నెల 7న బన్నీ పుట్టిన రోజు కావడంతో చిత్రం టీజర్ ను విడుదల చేస్తారని తెలుస్తోంది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో తెరకెక్కిన పుష్ప 1 ఎంత పెద్ద విజయం సాధించిందో తెలియంది కాదు. ఈ సినిమా తో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి పార్ట్ 2 షూటింగ్ నడుస్తుంది.