తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేసారు. ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో మంగళవారం ఉద‌యం 11 గంట‌ల‌కు ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఇంటర్‌లో 62శాతం ఉత్తీర్ణత నమోదైంది. మే 6వ తేదీన‌ మొదలైన ఇంటర్మీడియట్‌ పరీక్షలు మే 24న ముగిసిన విష‌యం తెలిసిందే. ఈ ఏడాది ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌తో కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 63 .32 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ సెకండ్ ఇయర్ లో 67.16 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఆగస్టు 1 నుండి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎప్పటిలాగానే ఈఏడాది కూడా బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో మేడ్చల్ ఫస్ట్ , హనుమకొండ సెకండ్ ప్లేస్ లో ఉంది. బాలుర ఉత్తీర్ణత ఫస్ట్ ఇయర్ లో 53 శాతం , సెకండ్ ఇయర్ లో 51 శాతం.