తెలంగాణాలో ప్రారంభమైన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు
telangana-inter-first-year-exams-started
హైదరాబాద్: తెలంగాణాలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా గతేడాది ఇంటర్ పరీక్షలు జరగని విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఫస్టియర్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,769 పరీక్ష కేంద్రాల్లో 4,59,228 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షా కేంద్రానికి వచ్చిన ప్రతి విద్యార్థికి థర్మల్ స్క్రీనింగ్, హాండ్ శానిటైజేషన్ చేసిన తర్వాతే పరీక్ష కేంద్రం లోపలికి అనుమతించారు. నేడు జరుగుతున్న సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు సెట్-ఏ ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/