తెలంగాణ-ఛ‌త్తీస్‌గ‌ఢ్ స‌రిహ‌ద్దులో ఎదురుకాల్పులు

ముగ్గురు మావోయిస్టుల మృతి

హైదరాబాద్: తెలంగాణ-ఛ‌త్తీస్‌గ‌ఢ్ స‌రిహ‌ద్దులో సోమ‌వారం ఉద‌యం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘ‌ట‌న తెలంగాణ‌లోని ములుగు జిల్లా, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బీజాపూర్ స‌రిహ‌ద్దులో సంభవించింది. పోలీసు బ‌ల‌గాలు, మావోయిస్టుల మ‌ధ్య జ‌రిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఎస్ఎల్ఆర్, ఏకే-47 రైఫిళ్ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/career/