తెలంగాణ ఐసెట్ షెడ్యూల్ విడుదల
మే 20, 21 తేదీల్లో ఐసెట్-2020 పరీక్ష

హైదరాబాద్: తెలంగాణ ఐసెట్-2020 షెడ్యూల్ విడుదలైంది. ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రాజిరెడ్డి, కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ పురుషోత్తం విడుదల చేశారు. ఈ నెల 9 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తుల సమర్పణకు తుది గడువు మార్చి 30. రూ.500 ఫైన్‌తో మే 14 వరకు, రూ.5 వేల ఫైన్‌తో మే 16 వరకు దరఖాస్తు సమర్పించవచ్చు. మే 20, 21 తేదీల్లో ఐసెట్2020 పరీక్ష నిర్వహించనున్నట్లు కన్వీనర్ వెల్లడించారు. మే 14 నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 27న ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. ఈ సారి ఐసెట్ పరీక్షకు నిమిషం నిబంధన అమలు చేయనున్నారు. తెలంగాణలో 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/