భారత మహిళ జట్టుపై నీకెర్క్ వ్యంగ్యాస్త్రాలు
ఫ్రీగా ఫైనల్స్‌కు చేరడం కంటే సెమీస్‌లో ఓడిపోవడమే బెటర్

సిడ్నీ: మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఫైనల్‌కు వెళ్లడాన్ని దక్షిణాఫ్రికా కెప్టెన్ డేన్ వాన్ నీకెర్క్ జీర్ణించుకోలేకపోతుంది. గురువారం సిడ్నీ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దాంతో గ్రూప్ స్టేజ్‌లో అత్యధిక విజయాలతో భారత్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించింది. దీనిపై సఫారీ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ వాన్ నీకెర్క్ పరోక్షంగా సెటైర్లు వేశారు. ఆసీస్‌తో జరిగిన రెండో సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికా ఓడిపోయి టోర్ని నిష్క్రమించిన తర్వాత నీకెర్క్ వ్యంగ్యంగా మాట్లాడారు. ఫ్రీగా ఫైనల్‌కు చేరడం కంటే సెమీస్‌లో ఓడిపోవడమే బెటర్ అంటూ భారత జట్టును ఉద్దేశించి తన మనసులోని అక్కసును బయటపెట్టింది. నేను కూర్చొని అబద్ధాలు చెప్పదల్చుకోలేదు. మేము గెలిచి ఫైనల్స్‌కు వెళ్లాలనే ప్రయత్నాం చేశాం. వర్షం వల్ల ఆగిపోతే అత్యధిక విజయాలతో మేము ఫైనల్స్ వెళతామనే ఆలోచనే లేదు. ఫ్రీగా ఫైనల్ పాస్‌ను సంపాదించడం కంటే ఆడి ఓడిపోవడమే బెటర్ అని నీకెర్క్ పేర్కొన్నారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/