స్వప్నలోక్ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం పై నేడు హైకోర్టులో విచారణ

TS High Court
TS High Court

హైదరాబాద్ః ఈరోజు తెలంగాణ హైకోర్టు స్వప్నలోక్ కాంప్లెక్స్ చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటన పై విచారణ చేపట్టనుంది. ప్రమాద తీవ్రత, కారణాలను విశ్లేషిస్తూ పత్రికల్లో ప్రచురితమైన కథనాలపై హైకోర్టు సుమోటోగా స్పందించింది. ప్రతివాదులుగా సీఎస్, జీహెచ్‌ఎంసీ కమిషనర్, డీజీపీ, హైదరాబాద్ సీపీ, అగ్నిమాపక శాఖ డీజీలతో పాటుగా 12 మందిని చేర్చింది. దీనిపై నివేదిక ఇవ్వాలని వారిని కొరింది. స్వప్నలోక్​ కాంప్లెక్స్​లో మార్చి16న రాత్రి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి.. ఆరుగురు ఊపిరాడక మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ఇక ఈ ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరణించివారికి 3 లక్షల ఎక్స్ గ్రేషియాను సీఎం కేసీఆర్ ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సీఎం. మృతుల కుటుంబాలతో పాటు, గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు.