కేసీఆర్ పై ధ్వజమెత్తిన కోమటిరెడ్డి

హైదరాబాద్ : ఇటీవల తెలంగాణ ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాలు వెల్లడి కాగా, పరీక్ష రాసిన వారిలో సగానికి పైగా ఫెయిల్ అయ్యారు. కేవలం 49 శాతం మందే పాసయ్యారు. ఫెయిల్ అయ్యామన్న వేదనతో రాష్ట్రంలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా, ఇంటర్ బోర్డు తీరు పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

“కేసీఆర్ గుర్తుపెట్టుకో… ఇంటర్ బోర్డు ఫెయిల్ చేసిన విద్యార్థులందరికీ వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఓటు హక్కు వస్తుంది. వారి జీవితాలతో చెలగాటమాడుతున్న మీకు, మీ పార్టీకి వచ్చే ఎన్నికల్లో బాధిత విద్యార్థులు తగిన బుద్ధిచెప్పడం ఖాయం!” అని వ్యాఖ్యానించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/