గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు : తెలంగాణ హైకోర్టు

పరీక్షను మళ్లీ నిర్వహించాలని టీఎస్ పీఎస్ సీకి ఆదేశం

Telangana High Court cancels Group 1 prelims

హైదరాబాద్‌ః తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్ సీ) ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా.. విచారణ జరిపిన హైకోర్టు శనివారం తీర్పిచ్చింది. ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి మరోమారు అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్ష నిర్వహించాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ఆదేశించింది.

రాష్ట్రవ్యాప్తంగా 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం జూన్ 11 న ప్రిలిమ్స్ పరీక్ష జరగగా.. 2.32 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష నిర్వహణలో పలు లోపాలు ఉన్నాయని, బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని, హాల్ టికెట్ నెంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారంటూ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన కోర్టు.. పరీక్షను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. కాగా, పేపర్ లీకేజీ కారణంగా గ్రూప్ 1 ఇప్పటికే ఒకసారి రద్దయింది.