సిఎం జగన్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

AP CM Jagan
AP CM Jagan

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత మినహాయింపు కావాలని ఏపి సిఎం జగన్‌ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. కాగా నేడు సిబిఐ కేసుల్లో సిఎం జగన్‌ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ కేసు విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. జగన్ కు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వొద్దని సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. ఆర్థికపరమైన కేసుల్లో ఉన్న నిందితులకు మినహాయింపు ఇవ్వొదని సిబిఐ కోరింది. జగన్ కు మినహాయింపు ఇస్తే సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉందని, మినహాయింపు ఇవ్వకుండా విచారణకు హాజరయ్యేలా ఆదేశాలివ్వాలని సీబీఐ తరఫు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. సిబిఐ దాఖలు చేసిన కౌంటర్ పై ఏప్రిల్ 9న వాదనలు వింటామని హైకోర్టు పేర్కొంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/