అధ్యక్షుడిగా భాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్

ఈ కార్యక్రమానికి కీలక నేతలు హాజరు

bandii sanjay
bandii sanjay

హైదరాబాద్; తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ నేడు భాద్యతలు స్వీకరించారు. అధిష్టానం మార్చి 10 వ తేదీనే తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా ఆయనను ప్రకటించింది . ఆ తరువాత కొద్దీ రోజులకే కరోనా నేపద్యంలో లాక్ డౌన్ విధించడంతో. లాక్ డౌన్ ముగిసిన అనంతరం అధ్యక్షుడిగా భాద్యతలు స్వీకరించాలాలి అని భావించారు. కానీ అధ్యక్షునిగా పార్టీ పరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన నేపథ్యంలో ఆయన నేడు బాధ్యతలు తీసుకున్నారు. కాగా లాక్ డౌన్ కారణంగా ఈ కార్యక్రమానికి కార్యకర్తలు ఎవరు రావొద్దని ముందుగానే బండి సంజయ్ సూచించారు. కీలక నేతలు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి; https://www.vaartha.com/news/national/