వాలెంటైన్స్ డే స్పెషల్‌.. ఇండిగో బంపర్‌ఆఫర్‌

IndiGo Airline
IndiGo Airline

ముంబయి: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రేమికుల రోజును పురస్కరించుకొని సూపర్ ఆఫర్‌ను ప్రకటించింది. వాలంటైన్ డే సేల్ పేరుతో నాలుగు రోజుల పాటు తక్కువ ధరకు విమాన టిక్కెట్లను విక్రయిస్తోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఇండిగో ఈ ప్రత్యేక ఆఫర్‌ను ఇచ్చింది. అన్ని ట్యాక్స్‌లు కలుపుకొని విమాన టిక్కెట్టు ప్రారంభ ధరని రూ.999గా నిర్ణయించింది. నాలుగు రోజుల పాటు దీనిని విక్రయిస్తుంది. ఈ నెల 14వ తేదీ లోపు అమలులో ఈ ఆఫర్ ఉంటుంది. ఈ ఆఫర్ కింద పది లక్షల సీట్లను కేటాయించింది. ఈ ఆఫర్ కింద బుకింగ్‌ చేసుకున్న ప్రయాణికులు మార్చి 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ లోగా ప్రయాణించాలి. ఫిబ్రవరి 11వ తేదీన ప్రారంభమైన ఈ ఆఫర్ వాలంటైన్ డే రోజున ముగుస్తుంది. మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. మార్చి 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఒక నగరం నుంచి మరో నగరానికి టిక్కెట్ బుక్ చేసుకొని ప్రయాణించవచ్చు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/