గోరంట్ల మాధ‌వ్‌పై టీడీపీ నేత‌లది అన‌వస‌ర రాద్ధాంతంః మంత్రి ఆదిమూల‌పు

ద‌మ్ముంటే ఆ వీడియో మాధ‌వ్‌దేన‌ని నిరూపించాల‌ని స‌వాల్‌

AP Minister Aadimoolapu Suresh
AP Minister Aadimoolapu Suresh

అమరావతిః వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ గోరంట్ల మాధ‌వ్ వీడియోపై ఏపీ మునిసిప‌ల్ శాఖ మంత్రి ఆదిమూల‌పు సురేశ్ శ‌నివారం స్పందించారు. గోరంట్ల మాధ‌వ్‌కు చెందిన‌దిగా చెబుతున్న ఆ వీడియో మార్ఫింగ్ చేసిన‌దేన‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఈ మేర‌కు శ‌నివారం మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా సురేశ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌పై టీడీపీ నేత‌లు అన‌వస‌ర రాద్ధాంతం చేస్తున్నార‌ని సురేశ్ మండిప‌డ్డారు. టీడీపీ నేత‌ల‌కు ద‌మ్ముంటే ఆ వీడియో ఎంపీ మాధ‌వ్‌దేన‌ని నిరూపించాల‌ని కూడా ఆయ‌న స‌వాల్ విసిరారు. వీడియో వ్య‌వ‌హారంపై పూర్తి స్థాయిలో విచార‌ణ జ‌రిపి… దానిని సృష్టించిన ఐటీడీపీకి చెందిన వ్య‌క్తుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/