పవన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌

pawan kalyan-Tamilisai Soundararajan

హైదరాబాద్‌: నేడు ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ జన్మదినం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ట్విట్ట‌ర్ ద్వారా ప‌వ‌న్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ‘జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు. మీరు ఎప్పుడు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాల‌ని,జీవితంలో మ‌రెన్నో విజ‌యాలు సాధించాలని మ‌నస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని త‌మిళిసై త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. మరోవైపు పవన్‌ కల్యాణ్‌కు అభిమానులు, సెల‌బ్రిటీలు, ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/