తెలంగాణ‌లో తెరుచుకోనున్న పాఠ‌శాల‌లు

నేడు అధికారిక ప్రకటన

హైదరాబాద్: క‌రోనా థ‌ర్డ్ వేవ్ ఉథృతి నేప‌థ్యంలో తెలంగాణ‌లో పాఠ‌శాల‌లు మూత‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. కాగా క‌రోనా వ్యాప్తి త‌గ్గుముఖంప‌డుతోన్న నేప‌థ్యంలో పాఠ‌శాల‌ల‌ను తెర‌వ‌నున్నారు. దాంతో తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు తెరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై తన నిర్ణయాన్ని తెలంగాణ సర్కార్ నేడు అధికారిక ప్రకటన చేయనుంది. సెలవులు 30 వరకే ఉన్నా ఒకరోజు ఆలస్యంగా స్కూల్స్ రీ-ఓపెన్ అవ్వనున్నాయి.

కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సెలవులు ముగుస్తుండటం.. పాఠశాలల పునఃప్రారంభంపై ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు ప్రశ్నించడం వల్ల ప్రభుత్వం నేడు తన నిర్ణయాన్ని ప్రకటించే ఛాన్స్ ఉంది. మరోవైపు విద్యాసంస్థలు తెరవాలని విద్యార్థుల పేరెంట్స్ నుంచి ఒత్తిడి రావడం కూడా ఓ కారణమే. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా సమీపిస్తున్నందున పాఠశాలలు తెరవాలని సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/