పొత్తు పేరు చెపితే వైస్సార్సీపీ ఉలిక్కిపడుతుందంటున్న బుద్ధా వెంక‌న్న‌

ఏపీ రాజకీయాల్లో పొత్తుల వ్యహారం ఇప్పుడు పెద్ద చర్చ కు దారి తీస్తుంది. వచ్చే ఎన్నికల్లో జనసేన , టీడీపీ పార్టీ లు కలిసి బరిలోకి దిగబోతున్నాయనే వార్తలు ఎక్కువగా వినిపిస్తుండడం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఈ పొత్తుల ఫై క్లారిటీ ఇస్తుండడం తో వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేత బుద్ధా వెంకన్న ట్విట్టర్ లో త‌మ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు పొత్తుల గురించి మాట్లాడితే వైసీపీ ఉలిక్కిప‌డుతోంద‌ని ఎద్దేవా చేశారు.

టీడీపీ పొత్తు ఎప్ప‌టికైనా బ‌హిరంగంగానే జ‌రుగుతుంద‌ని ఆయన పేర్కొన్నారు. టీడీపీ పొత్తులు అభ్యంత‌ర‌మైతే.. వైసీపీ తెర వెనుక అనైతిక, అస‌హ్య‌క‌ర చీక‌టి పొత్తుల సంగ‌తేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. తెలంగాణ నుంచి మూట‌లు, జాతీయ‌పార్టీల ఆశీస్సులు, పెద్దిరెడ్డి టూరిస్టు ఓట‌ర్లు, ప్ర‌శాంత్ కిశోర్ పేటీఎం బ్యాచులు, పింక్ డైమండ్ నాట‌కం, కోడిక‌త్తి డ్రామా, బాబాయ్ గుండె పోటు, ప్ర‌జాస్వామ్య ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌కే చీడ‌పురుగులాంటిది వైస్సార్సీపీ అంటూ వెంక‌న్న మండిప‌డ్డారు.