తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం సందర్బంగా నిరుద్యోగులకు తీపి కబురు తెలిపిన సీఎం కేసీఆర్

తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం సందర్బంగా నిరుద్యోగులకు తీపి కబురు తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆవిర్భవ దినోత్సవం సందర్బంగా ప‌బ్లిక్ గార్డెన్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లు నిర్వ‌హించారు. ఈ వేడుక‌ల్లో సీఎం కేసీఆర్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. కాగా అనంత‌రం ఆయ‌న మాట్లాడారు.. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరిందని అన్నారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఎనిమిదేళ్ల స్వల్పకాలంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని విశ్లేషించుకుంటే మనం సాధించిన ఘన విజయాలు ఎన్నో కళ్లముందు సాక్షాత్కరిస్తాయి. 75 సంవత్సరాల్లో దేశంలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను 8ఏళ్లలో మన తెలంగాణ రాష్ట్రం సాధించింది. ప్రతి విషయంలో తెలంగాణ రాష్ట్రం అవతరించే నాటికి.. నేటి స్థితిగతులకు పోలికే లేదన్నది జగమెరిగిన సత్యం. ఆర్థికవృద్ధిలో, తలసరి ఆదాయం పెరుగులలో, విద్యుత్‌ సరఫరా, తాగు, సాగునీటి సదుపాయం, ప్రజసంక్షేమం, పారిశ్రామిక, ఐటీ రంగాలతో పాటు అనేక రంగాల్లో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలువడం మనందరికీ గర్వకారణం అన్నారు.

అలాగే నిరుద్యోగులకు ఈ సందర్బంగా తీపి కబురు తెలిపారు. నోటిఫికేషన్ మరియు నోటిఫికేషన్ కు మధ్య కొంత వ్యవధి ఇవ్వాలని చెప్పినట్లు ఆయన వివరించారు. ఇప్పటికే పలు ప్రభుత్వ విభాగాలు నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యా రని ఆయన స్పష్టం చేశారు. అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్ అందిస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు.