‘మంచి రోజులు వచ్చాయి’ ట్రైలర్ మాములుగా లేదు

సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా మారుతీ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. దీపావళి సందర్భంగా నవంబర్ 4వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్య క్రమాలను గ్రాండ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేసారు.

కరోనా నేపథ్యంలో సాగే కామెడీ డ్రామాగా మారుతి ఈ సినిమాను రూపొందించినట్టు తెలుస్తోంది. లవ్ .. రొమాన్స్ .. కామెడీ సినిమాలో ప్రధానాంశాలుగా ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. వి.సెల్యులాయిడ్, ఎస్.కె.ఎన్ బ్యానర్‌లో ఈ మూవీ నిర్మించబడింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.