ఆశావర్కర్ల జీతాలు 30 శాతం పెంచుతూ తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు

రాష్ట్ర ఆశా వర్కర్ల జీతాలను 30 శాతం పెంచుతూ తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తాజా నిర్ణయంతో నెలసరి ప్రోత్సాహకాలు 7500 నుంచి రూ. 9750 కి పెరగనున్నాయి. కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మరియు ఎం హెచ్ ఎం కింద పని చేస్తున్న ఆశా వర్కర్ల నెలసరి ప్రోత్సాహకాలు పెంచుతూ రాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ ఏడాది జూన్ మాసం నుంచి ఈ పెంచిన ఇన్సెంటివులు వర్తిస్తాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేసీఆర్‌ సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయం పై తెలంగాణ రాష్ట్రంలోని.. ఆశా వర్కర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉత్తర్వులతో ఆశా వర్కర్ల నెలవారీ జీతం 2,250 పెరిగింది.