మొత్తానికి వర్మ కు అపాయింట్​మెంట్ ఇచ్చిన పేర్ని నాని

గత కొద్దీ రోజులుగా ఏపీలో సినిమా టికెట్ ధరల వివాదం కొనసాగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో టికెట్ ధరలు అమాంతం తగ్గించడం తో నిర్మాతలు , థియేటర్స్ యాజమాన్యం తో పాటు సినీ ప్రముఖులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో రామ్ గోపాల్ వర్మ వారం రోజులుగా ఏపీ సర్కార్ ఫై ట్వీట్ వార్ కొనసాగిస్తూ వస్తున్నాడు.

ఇటీవల మంత్రి పేర్ని నానిని కలిసేందుకు వర్మ అనుమతి కోరారు. మంత్రి అనుమతిస్తే తమ సమస్యలు వివరిస్తానని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరిస్తుందని ఆశిస్తున్నానని ట్వీట్​ చేశారు. ప్రభుత్వంతో గొడవకు దిగాలనేది తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. ఈ తరుణంలో మంత్రి పేర్ని నాని ఈనెల 10న వర్మ కు అపాయింట్​మెంట్ ఇచ్చారు.

వర్మ చేసిన విజ్ఞప్తికి.. మంత్రి పేర్ని నాని కూడా ట్విటర్ వేదికగా స్పందించారు. “ఆర్జీవీకి ధన్యవాదాలు.. తప్పకుండా త్వరలో కలుద్దాం” అంటూ.. రిప్లే ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే వర్మకి మంత్రి పేర్ని నాని ఈనెల 10న అపాయింట్​మెంట్ ఇచ్చారు. మరి ఈ భేటీ లో వర్మ ఏం మాట్లాడతారో..ఇండస్ట్రీ సమస్యల ఫై నాని ఎలా స్పందిస్తారో అని అంత మాట్లాడుకుంటున్నారు.