మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు రాజ్య‌స‌భ వాయిదా

న్యూఢిల్లీ: రాజ్య‌స‌భ‌లో వాయిదాల ప‌ర్వం కొన‌సాగుతున్న‌ది. ప‌న్నెండు మంది విప‌క్ష ఎంపీల స‌స్పెన్ష‌న్ ఎత్తివేత‌, పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర కోసం విప‌క్షాల డిమాండ్లు, తెలంగాణ‌లో ధాన్యం సేక‌ర‌ణకు స‌మ‌గ్ర విధానం తీసుకురావాలంటూ టీఆర్ఎస్ ఎంపీల ఆందోళ‌న నేప‌థ్యంలో శీతాకాల స‌మావేశాల ప్రారంభం నుంచి పెద్ద‌ల స‌భ‌లో ర‌భ‌స కొన‌సాగుతున్న‌ది. దీనికి తోడు మూడు రోజుల క్రితం నాగాలాండ్‌లో భ‌ద్ర‌తాబ‌ల‌గాలు.. ఉగ్ర‌వాదులుగా పొర‌బ‌డి పౌరుల‌ను కాల్చిచంప‌డం అగ్నికి ఆజ్యం పోసిన‌ట్ల‌య్యింది.

ఈ క్ర‌మంలో ఇవాళ కూడా రాజ్య‌స‌భ ప్రారంభం కాగానే విప‌క్ష ఎంపీలు త‌మ‌తమ డిమాండ్ల‌ను లేవ‌నెత్తారు. విప‌క్షాల డిమాండ్‌ల‌ను ప‌ట్టించుకోకుండా స‌భా కార్య‌కలాపాలు కొన‌సాగించే ప్ర‌య‌త్నం చేసినా సాధ్యంకాలేదు. దాంతో స‌భ మొద‌లైన ఐదు నిమిషాల‌కే స‌భాప‌తి రాజ్య‌స‌భ‌ను మ‌ధ్యాహ్నం రెండు గంట‌లవ‌ర‌కు వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/