తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు సిద్ధం: ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్

ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని వెల్లడి

telangana-chief-electoral-officer-vikas-raj-talks-about-assembly-elections

హైదరాబాద్‌ః తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వికాస్ రాజ్ వివరణ ఇచ్చారు. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు సిద్ధం అవుతున్నామని వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు మూడు నెలల సమయం మాత్రమే ఉందని తెలిపారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని పేర్కొన్నారు. అధికారులకు ఈవీఎంలపై అవగాహన కల్పిస్తున్నామని వికాస్ రాజ్ వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో చిరునామాల మార్పుపై ఫిర్యాదులు అందాయని, వాటిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈసారి 15 లక్షల కొత్త ఓటర్లు నమోదయ్యారని వెల్లడించారు. వారిలో 6.99 లక్షల మంది యువ ఓటర్లని తెలిపారు. మహిళా ఓటర్ల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తున్నామని వికాస్ రాజ్ పేర్కొన్నారు.

వచ్చే నెలలో 3,4,5 తేదీల్లో ఈసీ తెలంగాణ పర్యటన ఉంటుందని.. కేంద్రం ,రాష్టానికి చెందిన 20 ఏజెన్సీ లతో సమావేశాలు ఉంటాయి. తుది ఓటర్ల జాబితా తర్వాత జిల్లాలో సిబ్బందికి శిక్షణ ఉంటుంది. రాష్ట్ర ఎన్నికలకు రెండు,మూడు నెలలు నుంచి ఏర్పాట్లు జరుగుతున్నాయి. EVM ల చెకింగ్ జరుగుతుంది. ఓటర్ల జాబితా సవరణ కొనసాగుతుందని.. 18 ఏళ్లు నిండిన వారిని ఓటర్లు గా చేరుస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల షెడ్యూలను ఈసీ ఖరారు చేస్తుంది అని తెలిపారు. బోగస్ ఓట్ల పై పిర్యాదులు వస్తున్నాయి మేము పారదర్శకంగా ఓటర్ల జాబితాను తయారు చేస్తామని విసాస్ రాజ్ వెల్లడించారు.