దేశంలో కొత్తగా 3,11,170 కరోనా కేసులు
దేశ వ్యాప్తంగా 18,22,20,164 మందికి వ్యాక్సిన్లు

New Delhi: భారత్లో కొత్తగా 3,11,170 మందికి కరోనా నిర్ధారణ అయింది. మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇవాళ ఉదయం ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,46,84,077కు చేరింది. గత 24 గంటల్లో 4,077 మంది కరోనా తో మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 2,70,284కు పెరిగింది. తాజా గణాంకాల ప్రకారం దేశ వ్యాప్తంగా 18,22,20,164 మందికి వ్యాక్సిన్లు అందించారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/