తెలంగాణలో బతుకమ్మ పండుగ సంబరాలు ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణలో బతుకమ్మ పండుగ సంబరాలు ప్రారంభమైనాయి. నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ సంబరాలు జరగనున్నాయి. ఇప్పటికే పట్నం వాసులు పల్లెటూర్లకి చేరుకున్నారు. ఆడపడచుల రాకతో ప్రతిఇంటా కోలాహలం మొదలైంది. బంధువులు, స్నేహితులతో రాష్ట్రంలోని పల్లెలన్నీ సందడి సందడిగా మారాయి.

తొమ్మిది రోజుల పాటు జరిగే వేడుకల్లో మొదటి రోజు ఎంగిలిపూలు బతుకమ్మ నిర్వహిస్తారు. రోజుకో రకమైన పూలతో.. రోజుకో ప్రత్యేకమైన నైవేద్యాన్ని గౌరమ్మకు సమర్పిస్తారు. ఎంగిలి పూల బతుకమ్మ మహాలయ అమావాస్య రోజున మొదలవుతుంది. దీన్ని పెత్రామాస అని కూడా అంటారు. రాష్ట్రంలో ప్రతి ఆడపడుచు బతుకమ్మను స్వయంగా పేరుస్తుంది. వివిధ రకాల పూలతో.. భక్తిశ్రద్ధలతో.. పేరుస్తారు.సాయంత్రంపూట స్నేహితులు, బంధువులతో కలిసి ఆడబిడ్డలంతా ఎంతో సంబురంగా ఆడుకుంటారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/