కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థుల ఐదో జాబితా విడుదల

లోక్ సభ ఎన్నికల (Lok Sabha Polls) నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ (Congress) వరుసగా తమ పార్టీ అభ్యర్థులను (Candidates) విడుదల చేస్తూ వస్తుంది. ఇప్పటికే ఐదు జాబితాలను విడుదల చేసిన అధిష్టానం..సోమవారం ఆరో జాబితాను (Sixth List of Candidates) విడుదల చేసింది. ఈ జాబితాలో ఐదుగురు ఎంపీ అభ్య‌ర్థుల‌ను కాంగ్రెస్ అధిష్ఠానం ఖ‌రారు చేసింది. ఇందులో త‌మిళ‌నాడు, రాజ‌స్థాన్ రాష్ట్రాల‌కు చెందిన ఎంపీ అభ్య‌ర్థుల పేర్ల‌ను ప్ర‌క‌టించ‌డం జ‌రిగింది. ఇక ఇప్ప‌టివ‌ర‌కు విడుద‌ల చేసిన ఆరు జాబితాలలో క‌లిపి కాంగ్రెస్ మొత్తం 190 పార్ల‌మెంట్ స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది.

ఇందులో భాగంగా తెలంగాణ‌లోని 17 పార్ల‌మెంట్ స్థానాల‌కు గాను తొమ్మిది స్థానాల‌కే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. మ‌రో 8 పార్ల‌మెంట్ స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయాల్సి ఉంది. ఈ ఆరో జాబితాలో రాజస్థాన్‌లో అజ్మీర్ లోక్‌సభ స్థానం నుండి రామచంద్ర చౌదరి, రాజ్‌సమంద్ నుండి సుదర్శన్ రావత్, భిల్వారా నుండి దామోదర్ గుర్జార్, కోటా నియోజకవర్గంలో ప్రహ్లాద్ గుంజాల్‌కు చోటు కల్పించింది. రాజస్థాన్‌లో మొత్తం 25 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉండగా… రెండు దశల్లో పోలింగ్‌ జరగనుంది. ఫేజ్ 1 (ఏప్రిల్ 19) 12 స్థానాలకు పోలింగ్ జరగనుండగా, మిగిలిన 13 స్థానాలకు రెండో దశలో (ఏప్రిల్ 26న) పోలింగ్ జరుగుతుంది. ఇక తమిళనాడులో తిరునెల్వేలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై సి రాబర్ట్ బ్రూస్‌కు చోటు కల్పించింది. తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది.