మరో వివాదంలో చిక్కుకున్న నటి సంజన

బుజ్జిగాడు ఫేమ్ నటి సంజన మరో వివాదంలో చిక్కుకుంది. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి , రీసెంట్ గా విడుదలైన ఈమె..తాజాగా ఓ క్యాబ్ డ్రైవర్ తో గొడవ పెట్టుకొని వార్తల్లో నిలిచింది. షూటింగ్ నిమిత్తం ఈమె బెంగళూరులోని ఇందిరానగర్ నుంచి రాజరాజేశ్వరినగర్ వెళ్లేందుకు ఓలా క్యాబ్ బుక్ చేసుకుంది. కారు ఎక్కిన తర్వాత తన లొకేషన్‌ను మార్చాలని డ్రైవర్‌ను సంజన కోరింది. డ్రైవర్ సుసే మణి లొకేషన్ మార్చకుండా కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి కనుక్కున్నాడు. అతడు చెప్పిన సమాధానం తో ఆమెకు పట్టరాని కోపం వచ్చింది. కోపంతో ఊగిపోయిన సంజన డ్రైవర్‌ను దుర్భాషలాడుతూ అతడితో గొడవకు దిగింది. దీంతో అతడు ఈ మొత్తం ఘటనను వీడియో తీసి సంజనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సంజన కూడా ట్విట్టర్‌లో గొడవకు సంబంధించిన వివరాలను ట్వీట్ చేసింది. క్యాబ్ డ్రైవర్‌పై పలు ఆరోపణలు చేసింది. కారులో తాము నలుగురం ఉన్నామని, ఏసీ పెంచమన్నా పెంచలేదని పేర్కొంది. డ్రైవర్ మణి తమకు నిర్లక్ష్యంగా బదులిచ్చాడని, కారు డోర్ సరిగా లేదని ఆరోపించింది. ఈ ఘటనపై ఓలా కస్టమర్ సర్వీసుకు ఫిర్యాదు చేసింది. అలాగే, డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్టు కూడా తెలిపింది. మరి వీరిద్దరూ చెప్పిన దాంట్లో ఎవరిదీ నిజం అనేదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.