తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. కోమటిరెడ్డి, కెటిఆర్ సహా పలువురు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం

Telangana Assembly Speaker Election is Unanimous Gaddam Prasad

హైదరాబాద్‌ః తెలంగాణ నూతన అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికయ్యారు. స్పీకర్ పదవి కోసం మరెవరూ నామినేషన్ వేయకపోవడంతో గడ్డం ప్రసాద్ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. స్పీకర్ గా గడ్డం ప్రసాద్ బాధ్యతలను స్వీకరించాలని అక్బరుద్దీన్ కోరారు. ప్రొటెం స్పీకర్ ఆహ్వానం మేరకు స్పీకర్ గా గడ్డం ప్రసాద్ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం స్పీకర్ స్థానంలో గడ్డం ప్రసాద్ ను ముఖ్యమంత్రి కేసీఆర్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూర్చోబెట్టారు. ఆ తర్వాత సభలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన ఛైర్ వద్దకు వెళ్లి అభినందనలు తెలిపారు. ప్రస్తుతం స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన శాసనసభ కొనసాగుతోంది.

కాగా, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణస్వీకారం చేయించారు. ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కెటిఆర్, కడియం శ్రీహరి తదితరులు ఉన్నారు. అనారోగ్య కారణాలతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సభకు హాజరుకాలేదు. అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ గా ఉంటే తాము ప్రమాణస్వీకారం చేయబోమని బిజెపి ఎమ్మెల్యేలు ప్రకటించిన సంగతి తెలిసిందే. వారు చెప్పిన విధంగానే ఇప్పుడు కూడా ప్రమాణస్వీకారం చేయలేదు. కొత్త స్పీకర్ ఎన్నికైన తర్వాత వారు ప్రమాణస్వీకారం చేస్తారు.