ఏపిలో కొత్తగా 2602 కేసులు నమోదు

మొత్తం కేసులు సంఖ్య 40,646

coronavirus -ap

అమరావతి: ఏపిలో కరోనా ఉద్థృతి కొనసాగుతుంది. గత 24 గంటల్లో అత్యధికంగా 2602 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో ఏపిలో ఉన్న వారికి 2592, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 8 మంది, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 40,646కి పెరిగింది. గుంటూరులో 367, చిత్తూరు 328, కర్నూలు 315 కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత అనంతపురంలో 297, శ్రీకాకుళం 149, నెల్లూరు 127, పశ్చిమ గోదావరి 109, విజయనగరం 89, కడప 55, ప్రకాశం 53, కృష్ణా 37, విశాఖపట్నం జిల్లాలో 23 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. కాగా గడిచిన 24 గంటల్లో ఏపిలో 42 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం 6, చిత్తూరు 5, తూర్పుగోదావరి 5, ప్రకాశం 5, గుంటూరు 4, పశ్చిమ గోదావరి 4, కడప 3, విశాఖపట్నం 3, కర్నూలు 2, నెల్లూరు 2, విజయనగరం 2, కృష్ణాలో ఒకరు కరోనా వల్ల మరణించినట్టు ప్రభుత్వం తెలిపింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/