ప్రారంభమైన మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్: మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలిని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. కరోనా నేపథ్యంలో ఆరు ప్రశ్నలకు మాత్రమే అవకాశం కల్పించనున్నారు. ప్రశ్నోత్తరాలు ముగిసిన అనంతరం అరగంట పాటు జీరో అవర్ ఉంటుంది. టీ బ్రేక్ అనంతరం చారిత్రాత్మకమైన రెవెన్యూ చట్టాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత కరోనాపై చర్చ ప్రారంభించనున్నారు. సభ్యులు మాట్లాడిన అనంతరం చర్చకు ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/