డిసెంబర్ లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలుః డీకే అరుణ

telangana-assembly-elections-in-december-itself-said-dk-aruna

హైదరాబాద్‌ః తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ లోనే ఉంటాయని బిజెపి జాతీయ ఉపాద్యక్షురాలు డీకే అరుణ ప్రకటించారు. ఈరోజు మీడియాతో డీకే అరుణ మాట్లాడుతూ..బిజెపి అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17 న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని సమైక్య దినోత్సవం పేరుతో సిఎం కెసిఆర్ కొత్త నాటకం అంటూ ఫైర్ అయ్యారు.

మజ్లీస్ కోసమే సమైక్యతా నినాదం అంటూ అరుణ నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రత్యేక దేశం అని చెప్పిన కవిత కు ఈ ప్రాంతం పై ఎంత ప్రేమ ఉందొ అర్థమవుతోందని.. జమిలి ఎన్నికలు కేవలం ఉహగణాలేనని పేర్కొన్నారు. డిసెంబర్ లోనే ఎన్నికలు ఉంటాయనే నమ్మకం ఉందని.. సిఎం కెసిఆర్ ను ఓడించడమే లక్ష్యమన్నారు. అన్ని చోట్లా బలమైన అభ్యర్థులను బరిలో దింపుతామని డీకే అరుణ స్పష్టం చేశారు.