నవంబర్ 30 న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు..

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ ఎన్నికల తేదీ వచ్చేసింది. నవంబర్ 30 న తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు CEC రాజీవకుమార్ వెల్లడించారు. తెలంగాణతో పాటు రాజస్థాన్‌, మిజోరం, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ లకు సంబదించిన అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించడం జరిగింది.

తెలంగాణ లో నవంబర్ 30 న ఎన్నికలు జరుగగా..డిసెంబర్ 03 న ఫలితాలు వెల్లడి కానున్నాయి. మధ్య ప్రదేశ్ లో నవంబర్ 17 న , రాజస్థాన్ నవంబర్ 23 న , ఛత్తీస్‌గఢ్‌ లో రెండు దశల్లో పోలింగ్ జరగనున్నాయి. నవంబర్ 07 , 17 న జరగనున్నాయి. మిజోరం లో నవంబర్ 07 న ఎన్నికలు జరగనున్నాయి.

ఈ ఐదు రాష్ట్రాల్లో 679 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 16 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు. 60 లక్షల మంది మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుక్షణం నుంచే ఎన్నికల కోడ్ (Election Code) అమల్లోకి రానుంది. గత ఎన్నికల సమయంలో ఓట్ల గల్లంతు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ సారి అలాంటి మిస్టేక్స్‌ జరగకుండా చర్యలు చేపట్టింది ఎన్నికల కమిషన్.

తెలంగాణలో మొత్తం ఓటర్లు: 3,17,17,389
పురుష ఓటర్లు: 1,58,71,493
మహిళా ఓటర్లు: 1,58,43,339
ట్రాన్స్‌జెండర్ ఓటర్లు: 2,557
దివ్యాంగ ఓటర్లు: 5,06,493
కొత్తగా నమోదు చేసుకున్న వారు: 8,11,640
యువ ఓటర్లు: 5,32,990 ఉన్నారు.